Skip to main content

Posts

Showing posts from October, 2020

గురువు

ఆన్ లైన్ తరగతుల పుణ్యమా అని....ఇప్పుడు *గురువుల విలువ* తెలిసచ్చిన కరోనా సందర్బమిది...ఎంతైనా గురువు లేని విద్య గుడ్డి విద్యేనని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్న వేళ........... ఏముంది పంతుళ్ళు...ఏదో వస్తరు....పోతరు....నాలుగు మాటలు తోచింది చెప్తరు...లేకుంటే సెలవులు....ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.........కానీ దానికి భిన్నం..మా వృత్తి.మేం తరాల తయారుదారులం. ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4,5 గంటలు భరించలేని తల్లిదండ్రులు పిల్లల బళ్లకు పంపితే(వెల్లగొడితే)..... ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లల చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ,మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా,వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను,డాక్టర్లను,యాక్టర్లను,ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను, టీచర్లను,నాయకులను,అధికారులను ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా తరాలు *తరాలు* తయారుచేసే నిత్య విద్యార్థులం మేము. మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు. చెమటను సాక్ష్యం గా చూపడానికి... మా పనులు బురదలోనో,ఖార్ఖానా లో చేసేవి కావు.బట్టలకంటిన మురికిని చూపడానికి.... మా పనులు మూసలు కావు,మోసాల

సేవాహి పరమో ధర్మః

  పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వదంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకరార్ధ మిదం శరీరం. సేవాహి పరమో ధర్మః