Skip to main content

Posts

Showing posts from August, 2021

అఫ్ఘానిస్తాన్: అంధకారం నుంచి అంధకారంలోకి

ఈ దేశంలో మమ్మల్ని బతకనివ్వరు. మా బతుకు ఏమైనా మా పిల్లనైనా కాపాడండి!’ అఫ్ఘానిస్తాన్‌లోని కాబూల్‌ ‌విమానాశ్రయంలో తల్లుల ఆక్రందనల సారాంశమిది. ఆ తల్లులు లేదా విమానం ఎక్కడానికి సిటీ బస్సు వెనుక పరుగెత్తిన రీతిలో పరుగులు తీసిన జనం, ఎవ్వరూ విదేశీయులు కారు. స్వదేశంలో ఉండడానికి ఇష్టపడని దుర్భరస్థితిలో ఉన్న అఫ్ఘానిస్తానీయులే. కంచె పైనుంచి పిల్లలను అవతలకి అందిస్తున్న తల్లులు, తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాల దగ్గర విలపిస్తున్న మహిళలు, కాల్పుల మోతకు హడలెత్తిపోతున్న పసివాళ్ల ఏడుపులు.. ఇప్పుడు ఇవే అఫ్ఘానిస్తాన్‌లో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు. ఇదంతా తాలిబన్‌ అనే మతోన్మాదం తలకెక్కిన ముష్కరమూకల  స్వైర విహారం ఫలితం. మళ్లీ అదే రష్యా, అదే అమెరికా, అదే పాకిస్తాన్‌, అదే చైనా, అదే సౌదీ అరేబియా ఇంతటి ప్రారబ్ధాన్ని ఆ చిన్న దేశం మీదకు తిరిగి తెచ్చాయి. ఇంత జరుగుతున్నా కొన్ని దేశాలు మధ్యయుగాల  ఆలోచనతో ఉన్న తాలిబన్‌తో కలసి పనిచేస్తామని ప్రకటించడం వికృతం. వంట రుచికరంగా లేదన్న సాకుతో ఒక మహిళను చిత్రహింసలు పెట్టి దహనం చేసిన దుర్ఘటనను ఆ దేశ మహిళా న్యాయమూర్తి ఒకరు దు:ఖంతో చెప్పినా అంతర్జాతీయ హక్కుల కార్యకర్తలు