Skip to main content

Posts

Showing posts from December, 2021

నాయకుడు

  క్రీ.పూ. 327 సంవత్సరం లో అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక కాంక్ష తో వివిధ దేశాలను జయిస్తూ భారతదేశం కూడా జయించాలి అనే ఆలోచన తో ఈ దేశం పైకి అడుగిడి ఇక్కడి స్వార్థపరులైన కొందరు రాజులని మచ్చిక చేసుకుని మరికొందరు వీరులైన రాజులని, భారతదేశ సైనికులని ముందునిలపెట్టి యుద్ధం చేయించి గెలిచి తన ఆధీనంలోకి తీసుకుని అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఇక తనకు భారతదేశాన్ని జయించడం నల్లేరుపైన నడకే అని భ్రమిస్తూ ఉన్న సమయం లో....  అది తక్షశిలా విశ్వవిద్యాలయం. ఆ రోజుల్లో ప్రతి రాజ్యం లో మంత్రులుగా ఇక్కడ విద్యను అభ్యసించిన వారే ఉండేవారు. వీరంతా దేశము పైన ఎంతో అభిమానం కలిగి ఉండేవారు. కానీ స్వార్థపరులైన రాజుల ఆలోచనలకి ఏమిచేయలేక నిశ్చేస్తులై ఉండేవారు.  ఆ సమయంలో ఒక వ్యక్తి యావత్ భారతదేశాన్ని ఒక్కత్రాటి పైకి తీసుకుని వచ్చేవరకు నా సిగని ముడి వేయను అని ప్రతిజ్ఞభూని చంద్రగుప్తుని చేరదీసి అన్ని విద్యలూ నేర్పించి యాతని ద్వారా యావత్ భారతదేశాన్ని ఒక్కటి చేసి అలెగ్జాండర్ కలలను నిర్వీర్యం చేసిన మహా ఘనుడు, ఆచార్య విష్ణుగుప్తుడు అతనే మన చాణక్యుడు. అదే విధముగా ఒక్కసారి 16వ శతాబ్దానికి కనుక వెళ్లినట్లు అయితే అక్కడ