Skip to main content

Posts

Showing posts from April, 2022

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు.         ఇంటి దగ్గర నాన్న మునుపటిలా కాక నా మీద విసుక్కుంటున్నాడు.నా నిర్ణయాలు తప్పు పడుతున్నాడు. "ముందు ఏదో ఒక జాబ్ లో చేరిపోయి తరువాత మర