Skip to main content

Posts

Showing posts from November, 2023

బంగారు బాట

 బంగారు బాట  (వోటర్లకు దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనం) గెలుస్తానని  గాలి వ్యాపింపజేసినవాడి వెంటబడి పోవద్దు.  ఎవరు గెలవాలని  నీవు ఎంచుకొన్నావో,  అతనికి అన్ని విధాలా సహాయమందించి, అతడు గెలిచేలా చూడు. అప్పుడు అది నీ గెలుపు అవుతుంది.  గెలుస్తున్నాడని  గాలి వ్యాపింపజేసిన వాని వెనుక  మందలో గొఱ్ఱెలా నడిచినట్లయితే,  ఆ క్షణాన్నే నీవు ఓడిపోయావు,  వోట్ల లెక్కింపు అనంతర ఫలితంతో  సంబంధం లేదు. సిద్ధాంత నిబద్ధత,  కార్యప్రణాళిక లేని పార్టీ లు చాలా చేటు తెస్తాయి.  అటువంటి పార్టీలు నిలబెట్టిన మంచి వ్యక్తులు ఎన్నికైనా,  వారు చేయగలిగింది తక్కువ.  కాబట్టి వోటు వేసే ముందు  ఇది నిర్ధారించుకో:   నీవు  ఒక వ్యక్తికి వోటు వేయటం లేదు. ఒక పార్టీకి వేస్తున్నావు.  పార్టీకి వేయటమంటే,  అందమైన గుర్తునుచూసి  వోటు వేయటం కాదు,  ఒక స్పష్టతగల్గిన సిద్ధాంతానికి,  నిర్దిష్టమైన కార్య ప్రణాళికకూ  వోటువేస్తున్నావు.  ఎట్టి పరిస్థితుల్లోనూ   పైసలకు కక్కుర్తిపడి  నీవోటును  వృధా చేసుకోవటం లేదని  నిర్ధారించుకో!