Skip to main content

Posts

Showing posts from April, 2020

ఉత్తిష్ఠత భరతసుతా....

ఇటుపక్క రాష్ట్రములో లాక్డౌన్ టైమ్‌లో జనము ఒక చోట చేరి దేవుడికి అభిషేకము చేయడము కనిపించిన #Media #Channelకి అటుపక్క రాష్ట్రములో ఇదే లాక్డౌన్ సమయంలో వంద మంది ఎగబడి నా స్వామీజీలను విచక్షణా రహితముగా కొట్టి చంపితే కనబడలేదా? కనబడినా.. కనబడనట్లు కపట నాటకాలా? ఒక వేళ కపటనాటకమైతే ఆ నాటకము ఎవరికి భయపడి???  ఇదేనా వీల్లకి తెలిసిన #Journalism అదే పోలీసు లాఠీదెబ్బలకు (దెబ్బతగలకున్నా) ఒకడు చనిపోతే పెద్దవార్త... వచ్చేవారము నుండి శివరాత్రి (పండగ పేరు మార్చాము).. ఉపవాసాలు జరుపుకోనున్న రవి (పేరు మార్చాము) అతని వర్గము.. ఏమి జరిగినా నిర్భయముగా చెప్పేవాడే #Journalist కానీ నేడు అలాంటి వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చేమో.... ఉత్తిష్ఠత భరతసుతా....

స్వర్గంకన్నా మిన్న నా జన్మభూమి - స్వామీ వివేకానంద

సోదరా ! 'భరతభూమియే నా అత్యున్నత స్వర్గం. భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు' అని పలుకు. రేయింబవళ్లూ ఈ వాక్యమునే స్మరించు. నీవు భారతీయుడవని గర్వించు.  'అజ్ఞుడైన భారతీయుడు, నిరుపేదైన భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు... వీరందరూ నా సోదరులే' అని ఘోషించు. 'భారతీయుడు నా సోదరుడు, భారతీయుడు నా ప్రాణం, భారతదేశపు దేవదేవీ జనమే నా దైవము, భారత సంఘమే నా  బాల్యకాలపు ఊయల, నా యౌవనకాలపు క్రీడావనం, నా వార్ధక్యపు వారణాసి - నా పుణ్యలోకం' అని ఉన్నత స్వరంతో సగర్వంగా ప్రకటించు. 

జలియన్ వాలాబాగ్ ఉదంతం (13/04/1919) జరిగి నేటికి 103 యేండ్లు.

పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయి ప్రభుత్వమే వేలాది అమాయక జనాన్ని పిట్టల్లా కాల్చి చంపిన కనీవినీ ఎరుగని కిరాతకం, కరకు ఆంక్షల ఇనుప తెరలు దాటి బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది. గజగజ వొణుకుతూ వెనక్కి వచ్చిన బండ్ల వారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు దారుణ దుర్వార్త ఆ రాత్రే తెలిసిపోయింది. ఘోరాతిఘోరాన్ని విన్న వారికి ఆ రాత్రి కునుకు లేదు. వారి గుండెలను పిండిన వేదనకు అంతులేదు.  అది...... 13 ఏప్రిల్ 1919, వైశాఖి పర్వదినం. పంజాబీలకు అతి ముఖ్యమైన పంటల పండుగ. దీపావళి, హోళీల్లాగే వైశాఖినీ హిందు, సిక్కు తేడా లేకుండా, కులభేదం పాటించకుండా అందరూ కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఆ ఏడూ ఎక్కడెక్కడి పల్లెల వారు బండ్లు కట్టుకుని అమృతసర్ చేరారు. కొత్త బట్టలు బొమ్మలు కొనిపెడుతూ, స్వర్ణ దేవాలయం దర్శించి, ఊరి బయట పెద్ద మేళాలో ఆటపాటల్లో పాల్గొంటూ జనం దిలాసాగా ఉన్నారు.  ఇది ప్రతి ఏడూ మామూలే. కానీ ఈసారి ఏదో చెప్పరాని వెలితి. ఊరివాళ్ల మొగాల్లో ఆందోళన. వాతావరణంలో ఉద్రిక్తత.  నాటికి నాలుగు రోజుల ముందు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనను పురికొల్పిన సేఫుద్దీన్, సత్యపాల

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

"నీ పని ఒక రైల్వే క్రాసింగు ను ఊడ్చటం మాత్రమే కావచ్చు. కానీ ప్రపంచంలో మరియే యితర రైల్వే క్రాసింగు కూడా నీ క్రాసింగంత శుభ్రంగా ఉండదు అనిపించే విధంగా దానిని ఊడ్చటం నీ కర్తవ్యం అని గుర్తుంచుకో".
పావన హైందవ జాతి సేవలో జీవనమొక దినమైన చాలదా.  నిత్యము సాగే సత్య యజ్ఞమున సమిదై మండుటే మోక్షము కాదా.