ఒక ఉప్మా కథ చెబుతాను వినండి. 100 మంది పిల్లలకు హాస్టల్‌లో ప్రతిరోజూ ఉప్మా వడ్డిస్తారు. 100 మంది విద్యార్థుల్లో 80 మంది విద్యార్థులు మాకు వేరె టిఫిన్ కావాలి అని వార్డెనుకు ఫిర్యాదు చేశారు. కానీ, అందులో 20 మంది విద్యార్థులు తమకు ఉప్మా తినడం ఆనందంగా ఉంది అన్నారు. 80 మంది విద్యార్థులు ఉప్మా కాకుండా వేరే ఏమైనా కావాలి అని కోరుకున్నారు. ఒక నిర్ణయానికి రావడానికి చాలా గందరగోళంతో, వార్డెన్ ఓటింగ్ ఏర్పాట్లు చేశాడు.ఇప్పుడు ఏ టిఫిన్‌కు మెజారిటీ లభిస్తుందో, ఆ టిఫిన్ తయారు చేయబడుతుంది. ఉప్మా కోరుకున్న 20 మంది విద్యార్థులు వెంటనే ఓటు వేశారు. మిగిలిన 80 మంది విద్యార్థులలో వారి అభిరుచి ప్రకారం ఇలా ఓటు వేశారు. 18: మసాలా దోస 16: ఆలూ పరోటా & పెరుగు 14: రోటీ & కూర 12: బ్రెడ్ & వెన్న 10: నూడుల్స్ 10: ఇడ్లీ సాంబార్ కాబట్టి, ఓటింగ్ సరళి మరియు మెజారిటీ ప్రకారం చివరికి ఉప్మా కొనసాగించబడింది. పాఠం ఏంటి అంటే: మన జనాభాలో 80% మంది స్వార్ధపూర్వకంగా, విభజించబడి చెల్లాచెదురుగా ఉంటే, 20% వాళ్లే మనలను శాసిస్తారు. ఏదైనా అర్ధం అయ్యిందా..
Assistant Professor