అనుచిత వ్యాఖ్యలు తగవు! ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..! బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక...
Assistant Professor