Skip to main content

స్వర్గంకన్నా మిన్న నా జన్మభూమి - స్వామీ వివేకానంద


సోదరా ! 'భరతభూమియే నా అత్యున్నత స్వర్గం. భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు' అని పలుకు. రేయింబవళ్లూ ఈ వాక్యమునే స్మరించు. నీవు భారతీయుడవని గర్వించు. 

'అజ్ఞుడైన భారతీయుడు, నిరుపేదైన భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు... వీరందరూ నా సోదరులే' అని ఘోషించు.

'భారతీయుడు నా సోదరుడు, భారతీయుడు నా ప్రాణం, భారతదేశపు దేవదేవీ జనమే నా దైవము, భారత సంఘమే నా  బాల్యకాలపు ఊయల, నా యౌవనకాలపు క్రీడావనం, నా వార్ధక్యపు వారణాసి - నా పుణ్యలోకం' అని ఉన్నత స్వరంతో సగర్వంగా ప్రకటించు. 



Comments

  1. జయ జయ జయహే భారతి - జగమంత కోరు నీ సంస్కృతి

    ReplyDelete
  2. ఆరోజు .. మళ్ళీ రాదోయి.. కానీ ఆ జ్ఞాపకం నిరంతరం నీ వెంటేనోయి..

    ReplyDelete

Post a Comment