*మనకు రామాయణ మహా కావ్యం అందించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నా ప్రణామాలు... * మర్యాదా పురుషోత్తముడు, ఆదర్శ మూర్తి శ్రీ రామ చంద్రుని చరితం మనకి ఆచరణీయం... వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మః అన్నా, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి బోధించిన పదం, శబ్దం, భావం, గమనం, గమకం అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి శ్రీమద్ రామాయణం లో... రాజు ప్రజలను ఎలా చూసుకోవాలి, తండ్రి మాటకు విలువ, తమ్ములకు ఆదర్శ అన్నగా, ఆదర్శ భర్తగా, దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కష్టాలు పడి... ధర్మానికి విగ్రహంగా నిలిచిన మూర్తి శ్రీ రాముడు… ఆ శ్రీ రాముడి చరితం అందజేసిన ఋషి వాల్మీకి... వాల్మీకి మహర్షి తొలి శ్లోకం: మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥ యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥ ఓ వేటగాడా! నీకు అనంత కాలం శాంతి లభించదు. ఎందుకంటే నీవు ప్రేమ, ప్రణయ పూర్వక క్రియలో లీనమై సావదానంగా లేని క్రౌంచ పక్షులజంటలో ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం ర
Assistant Professor