Skip to main content

మహర్షి వాల్మీకి

 *మనకు రామాయణ మహా కావ్యం అందించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నా ప్రణామాలు...

👏🏻👏🏻*

మర్యాదా పురుషోత్తముడు, ఆదర్శ మూర్తి శ్రీ రామ చంద్రుని చరితం మనకి ఆచరణీయం...

వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మః అన్నా, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి బోధించిన పదం, శబ్దం, భావం, గమనం, గమకం అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి శ్రీమద్ రామాయణం లో...

రాజు ప్రజలను ఎలా చూసుకోవాలి, తండ్రి మాటకు విలువ, తమ్ములకు ఆదర్శ అన్నగా, ఆదర్శ భర్తగా, దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కష్టాలు పడి... ధర్మానికి విగ్రహంగా నిలిచిన మూర్తి శ్రీ రాముడు…

ఆ శ్రీ రాముడి చరితం అందజేసిన ఋషి వాల్మీకి...

వాల్మీకి మహర్షి తొలి శ్లోకం:

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ వేటగాడా! నీకు అనంత కాలం శాంతి లభించదు. ఎందుకంటే నీవు ప్రేమ, ప్రణయ పూర్వక క్రియలో లీనమై సావదానంగా లేని క్రౌంచ పక్షులజంటలో ఒక (మగ) పక్షిని చంపితివి.

ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.



రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు. 


Comments

Popular posts from this blog

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు      ...

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు. ...

ఆలోచించండి ఓ అమ్మ, నాన్న

 ఆలోచించండి ఓ అమ్మ, నాన్న తల్లిదండ్రులు అలోచించి సరియైన నిర్ణయము తీసుకోవలసిన సమయము ఇది. ఎంసెట్ పరీక్ష పూర్తి అయి ఫలితాలు కూడా వచ్చిన సందర్భంలో ప్రతి తల్లి తండ్రి సరియైన దిశలో అలోచించి తమ పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఒక నిర్ణయము తీసుకోవాల్సిన సమయము ఇది. ఇంజనీరింగ్ విషయము లో చాల మంది తల్లిదండ్రులు అయోమయం లో కొట్టుమిట్టాడుతున్న సమయము ఇది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీ ఎంచుకోవాలి అనే అయోమయ పరిస్థితుల్లో అటు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉన్నారు. ఇంజనీరింగ్ చదివించాలి అనుకోవడమే మొదట మనము తీసుకున్న మంచి నిర్ణయము. అందులో ఏ బ్రాంచ్ తీసుకున్న, సరియైన కార్యాచరణ వేసుకుని దానిని అమలు పరుస్తూ నాలుగు సంవత్సరాలు చదువు పైన ద్రుష్టి పెట్టి, చదువుతో పాటుగా సాంస్కృతిక, సామజిక మరియు సాంకేతికపరమైన  కార్యక్రమాలలో చురుకుగా పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒక మంచి కాలేజీ లో సీట్ రాగానే తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరినట్లు కాదు. నిశితముగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చూస్తూ వారు సరియైన దిశలో వెళ్లేలా మార్గదర్శనం చేయవల్సిన బాధ్యత కూడా తల్లిదండ...