సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో. వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు. చాకివాడు = వస్త్రాన్ని చీకాకు పడజేసి = బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు ...
Assistant Professor