పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయి ప్రభుత్వమే వేలాది అమాయక జనాన్ని పిట్టల్లా కాల్చి చంపిన కనీవినీ ఎరుగని కిరాతకం, కరకు ఆంక్షల ఇనుప తెరలు దాటి బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది. గజగజ వొణుకుతూ వెనక్కి వచ్చిన బండ్ల వారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు దారుణ దుర్వార్త ఆ రాత్రే తెలిసిపోయింది. ఘోరాతిఘోరాన్ని విన్న వారికి ఆ రాత్రి కునుకు లేదు. వారి గుండెలను పిండిన వేదనకు అంతులేదు. అది...... 13 ఏప్రిల్ 1919, వైశాఖి పర్వదినం. పంజాబీలకు అతి ముఖ్యమైన పంటల పండుగ. దీపావళి, హోళీల్లాగే వైశాఖినీ హిందు, సిక్కు తేడా లేకుండా, కులభేదం పాటించకుండా అందరూ కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఆ ఏడూ ఎక్కడెక్కడి పల్లెల వారు బండ్లు కట్టుకుని అమృతసర్ చేరారు. కొత్త బట్టలు బొమ్మలు కొనిపెడుతూ, స్వర్ణ దేవాలయం దర్శించి, ఊరి బయట పెద్ద మేళాలో ఆటపాటల్లో పాల్గొంటూ జనం దిలాసాగా ఉన్నారు. ఇది ప్రతి ఏడూ మామూలే. కానీ ఈసారి ఏదో చెప్పరాని వెలితి. ఊరివాళ్ల మొగాల్లో ఆందోళన. వాతావరణంలో ఉద్రిక్తత. నాటికి నాలుగు రోజుల ముందు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనను పురికొల్పిన సేఫుద...
Assistant Professor
Comments
Post a Comment