Skip to main content

నాయకుడు

 క్రీ.పూ. 327 సంవత్సరం లో అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక కాంక్ష తో వివిధ దేశాలను జయిస్తూ భారతదేశం కూడా జయించాలి అనే ఆలోచన తో ఈ దేశం పైకి అడుగిడి ఇక్కడి స్వార్థపరులైన కొందరు రాజులని మచ్చిక చేసుకుని మరికొందరు వీరులైన రాజులని, భారతదేశ సైనికులని ముందునిలపెట్టి యుద్ధం చేయించి గెలిచి తన ఆధీనంలోకి తీసుకుని అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఇక తనకు భారతదేశాన్ని జయించడం నల్లేరుపైన నడకే అని భ్రమిస్తూ ఉన్న సమయం లో.... 


అది తక్షశిలా విశ్వవిద్యాలయం. ఆ రోజుల్లో ప్రతి రాజ్యం లో మంత్రులుగా ఇక్కడ విద్యను అభ్యసించిన వారే ఉండేవారు. వీరంతా దేశము పైన ఎంతో అభిమానం కలిగి ఉండేవారు. కానీ స్వార్థపరులైన రాజుల ఆలోచనలకి ఏమిచేయలేక నిశ్చేస్తులై ఉండేవారు. 

ఆ సమయంలో ఒక వ్యక్తి యావత్ భారతదేశాన్ని ఒక్కత్రాటి పైకి తీసుకుని వచ్చేవరకు నా సిగని ముడి వేయను అని ప్రతిజ్ఞభూని చంద్రగుప్తుని చేరదీసి అన్ని విద్యలూ నేర్పించి యాతని ద్వారా యావత్ భారతదేశాన్ని ఒక్కటి చేసి అలెగ్జాండర్ కలలను నిర్వీర్యం చేసిన మహా ఘనుడు, ఆచార్య విష్ణుగుప్తుడు అతనే మన చాణక్యుడు.



అదే విధముగా ఒక్కసారి 16వ శతాబ్దానికి కనుక వెళ్లినట్లు అయితే అక్కడ కూడా యావత్ భారతదేశాన్ని తమ గుప్పిటిలో పెట్టుకోవాలి అని తహతహలాడుతున్న మొఘలులు వారికి తోడుగా స్వార్ధ చింతన అధికారవ్యామోహముతో మాతృభూమికీ వెన్నుపోటు పొడిచే రాజ్యాహంకార రాజులు ఇలా ఎవరికివారై ఉన్న ఆ రోజుల్లో.... 

సాక్షాత్తు భగవాన్ శ్రీ కృష్ణుల వారు చెప్పినట్లు ఎప్పుడెప్పుడు అయితే ధర్మము ఆపదలోపడుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అన్నట్లుగానే మళ్ళీ ఒక నాయకుడు వచ్చాడు.

చిన్నతనంలో తల్లి ఒక దుర్గాన్ని జయించు అని చెబితే వెంటనే జయించి ఇచ్చిన వీరుడు. తదనంతర కాలంలో ఈ యావత్ భారతదేశాన్ని ఒక్కటిగా చూడాలి అనే సంకల్పం తో మొఘలులని అందరిని ఒక్కడే తన గొరిల్లా యుద్ధ నైపున్యములతో వీర సింహమువలె విరుచుకుపడి భారతదేశంలో మళ్ళీ హిందూసామ్రాజ్యాన్ని స్థాపించి తృణప్రాయముగా తన గురువు అయిన సమర్ధ రామదాసులకి పాదాంకితం చేసిన మహోన్నతుడు. అటుపిమ్మట ఆ గురువు ఆజ్ఞ మేరకు యావత్ హిందూ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతే మన శివాజీ మహారాజ్.


మరల ఒక్కసారి 19వ శతాబ్దము లోకి మనము వెళ్లినట్లు అయితే యావత్ ప్రపంచము మా మతము గొప్పది అంటే మా మతము గొప్పది అని చాటుతున్న వేళ నా ఈ భారతదేశము నుండి శ్రీ రామకృష్ణ పరమహంసల ప్రియ శిష్యుడు నరేంద్రుడు అనే ఒక సాధువు ప్రపంచ మహాసభలలో ఉపన్యసించడానికి వెళ్లి, తన అవకాశము రాగానే నిర్భయముగా అప్పటివరకు ఎవ్వరు సంబోదించని మరియు వారెవ్వరూ మునుపెన్నడూ విననటువంటి పదజాలము, "నా ప్రియాతిప్రియమైన సోదర సోదరీమణులారా" అని అనగానే సభ అంతా రెండు నిమిషాలపాటు కరతాళ ధ్వనులతో మారుమ్రోగుతుంటే వివేకానందులు ఆశ్చర్యచకితులైనారు. ఎందుకంటే పాశ్చాత్య ధోరణిలో ప్రసంగాన్ని ప్రారంభించేప్పుడు మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అనడం అలవాటు.

వివేకానందుడు ప్రసంగిస్తూ నా హిందూధర్మము మాత్రమే యావత్ ప్రపంచము ఒక వసుదైక కుటుంబము అని, సర్వమానవాళి శాంతి సౌబ్రాతృత్వాన్ని కోరుకునేది అని ఉటంకిస్తూ, నా హిందూధర్మము ఒక మాహాసముద్రము లాంటింది, ఎలాగైతే చిన్న చిన్న నదులు వివిధ మార్గాలల్లో ప్రయాణించి చివరకు వచ్చి మహాసముద్రములో చేరుతాయో ఈ వివిధ మతాలన్నీ అలా చివరకు నా హిందూధర్మము తో ఏకీభావం తెలుపాల్సినదే, అని తన ఉపన్యాసాన్ని ముగించి ఆ తర్వాత వివిధ దేశాలకు వెళ్లి హిందూధర్మము యొక్క ఔనత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటిన మాహా ఘనుడు స్వామీ వివేకానందుడు. 


ఇలా నా భారతదేశం ఎప్పుడు ఆపదలో చిక్కుకున్న అప్పుడు ఒక గురువు మార్గదర్శనములో నాయకుడు ముందు ఉండి నా భారతదేశాన్ని విజయతీరాలకు చేర్చాడు. 

మరి నేటి పరిస్థులల్లో కూడా అలాంటి వారు ఉన్నారా అని మనము ఆలోచిస్తే 

ఒక్క సారి నేటి పరిస్థితులను కనుక చూచినట్లు అయితే కరోనా అనే ఒక మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది, నా భారతదేశములో కూడా ఆ మహమ్మారి మమ్ములని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కానీ నా దేశ ప్రజలు ఎవ్వరు భయపడకుండా ధైర్యముగా ఈ మహమ్మారిని ఎదురుకునేందుకు మా ముందు ఒక నాయకుడు నిలబడ్డాడు. కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకి తన ఆపన్న హస్తం అందిస్తూ అందరిని ఈ మహమ్మారి నుండి బయటపడవేసే ప్రయత్నం చేస్తున్నాడు అతనే శ్రీ నరేందర దామోదర దాస్ మోడీ. 130కోట్ల భారతీయుల్ని కరతాళ ధ్వనులతో, దీపకాంతులతో ఏకం చేసిన ఘనత మా నాయకుడిది.

ఏ విధముగా అయితే చంద్రగుప్తుడికి చాణక్యుడు ఎలానో, శివాజీ కి సమర్థరామదాసు ఎలానో అలా మన మోడీ కి ఎవరు ఉన్నారు?

మరి నా నాయకుడి గురువు ఎవరు అతనికి ఈ స్ఫూర్తిని అందిస్తున్నది ఎవరు అని ఆలోచించినట్లు అయితే

అది మొదటి ప్రపంచయుద్ధము పూర్తిఅయి ఆంగ్లేయులు విజయగర్వం తో ఉన్న సమయం, నా భారతదేశములో స్వాతంత్య్ర ఉద్యమాలు హోరుగా జరుగుతున్న సమయము. ప్రజలని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేందుకు స్ఫూర్తిని ఇచ్చే వారందరిని ఆంగ్లేయులు అరెస్టు చేయనారంభించారు. 

అలా ఆనాటి కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నటువంటి ఒక నాయకుడిని కూడా బంధించి చెరసాలలో పెట్టిన ఆంగ్లేయులకు ఆనాడు తెలియలేదు అది ఎంత పెద్దతప్పో. 

అలా అరెస్టు అయి చెరసాలలో ఉన్న వ్యక్తికి వచ్చిన ఒకే ఒక్క ప్రశ్న తన తదనంతర జీవితాన్ని మార్చేసింది, ఒక సంఘటనా శక్తికి జీవం పోసింది. 

అస్సలు ఏమిటి ఆ ప్రశ్న?? ఏమిటి ఆ సంఘటనా శక్తి?? ఎవరా నాయకుడు?? ఎవరు నేటి మన మోడీ కి స్ఫూర్తి ప్రధాత?

ఆ ప్రశ్నే ఇన్ని పోరాటాలు ఎందుకు వృధాగా పోతున్నాయి? నా భారతదేశము బానిసత్వము లోనికి ఎందుకు వెళ్ళింది? నా భారతదేశము స్వాతంత్య్రము ఎందుకు కోల్పోయింది? 

ఆ కారాగారములో ఒక రోజు అంతా నిద్ర పోనీకుండా ఆ వ్యక్తిని తొలుస్తున్న ప్రశ్న, కానీ ఆ ప్రశ్న కి సమాధానం చెప్పేది ఎవ్వరు? అని ఆలోచిస్తున్న తరుణములో తన ప్రశ్నకి తానే సమాధానము వెతుకున్నాడు. అదే హిందువులలో సంఘటన (ఐకమత్యము) లోపించడము. ఈ దేశము నాది ఈ ధర్మము నాది అనే భావన లోపించడము. హిందువులలో స్వార్థచింతన పెరిగి దేశముపట్ల ప్రేమాభిమానాలు సన్నగిల్లడము. 

సమాధానము వచ్చినదే తడువు తన ఆలోచనని కార్యరూపము దాల్చే పనిలో నిమగ్నుడై 1925వ సంవత్సరము, విజయదశమి నాడు నాగపూర్ లోని రేషంబాగ్ లో ఒక సంస్థని ప్రారంభించాడు, అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ సంస్థ లక్ష్యం హిందూసంఘటన ద్వారా అఖండభారత నిర్మాణము. అలా భగవాధ్వజ ఛాయలలో ఆ సంఘటనా శక్తిని ప్రారంభించిన వాడే మన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ గారు (డాక్టర్ జీ). అలా ఒక వ్యక్తి ఆనాడు ప్రారంభించిన ఒక మహోన్నత కార్యం నేడు దేశములో పెద్ద వట వృక్షమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దేశానికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అడుగు ముందుకేస్తుంది. ఎందరో క్రమశిక్షణా వంతులైన వ్యక్తులను తాయారు చేస్తూ, వ్యక్తి మార్పుతోనే దేశప్రగతి సాధ్యము అనే భావన కలిగిన వ్యక్తులని దేశానికి అందిస్తున్నది.


అలా ఆనాడు, ఈనాడు మరి ఏనాడు అయినా ఒక నాయకుడు సన్మార్గములో నడుస్తూ ఒక దేశాన్ని ప్రగతిపథం లోకి తీసుకుని వెళ్ళాలి అంటే ఒక మంచి గురువుయొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది.

భారతమాతకు జయమగుగాక... 
తరిగొప్పుల రాజా రామన్న,అసిస్టెంట్ ప్రొఫెసర్

Comments

Popular posts from this blog

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు                                          పెట్టి మైలబుచ్చి                 =      మాపు ను పోగొట్టి మంచి మడుపు జేయు  =     చక్కగా మడత పెడతాడు.

గమ్యము - మార్గము - పయణం

  ఓ విద్యార్థి! ఏది నీ గమ్యము, ఎటువైపు నీ పయనం. గమ్యము (లక్ష్యము) లేని పయనం లో ఆయాస పడుతూ ఎక్కడి వరకు, ఎంత వరకు. గమ్యము (లక్ష్యము) గుర్తెరిగి, కర్తవ్యము బోధపడి ఆ దిశగా వడివడి అడుగులు వేయగా, కాలము చాలా చిన్నది, విలువైనది చేజారిన తిరిగి రాదు. ఇక నైనా మేలుకో, గమ్యము (లక్ష్యము) ఎన్నుకొని గమ్య మార్గము నిర్ణయించుకుని ఆ దిశగా పయణము కొనసాగించు. విజయము సర్వదా సర్వత్రా నీదే. 

ఆలోచించండి ఓ అమ్మ, నాన్న

 ఆలోచించండి ఓ అమ్మ, నాన్న తల్లిదండ్రులు అలోచించి సరియైన నిర్ణయము తీసుకోవలసిన సమయము ఇది. ఎంసెట్ పరీక్ష పూర్తి అయి ఫలితాలు కూడా వచ్చిన సందర్భంలో ప్రతి తల్లి తండ్రి సరియైన దిశలో అలోచించి తమ పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఒక నిర్ణయము తీసుకోవాల్సిన సమయము ఇది. ఇంజనీరింగ్ విషయము లో చాల మంది తల్లిదండ్రులు అయోమయం లో కొట్టుమిట్టాడుతున్న సమయము ఇది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీ ఎంచుకోవాలి అనే అయోమయ పరిస్థితుల్లో అటు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉన్నారు. ఇంజనీరింగ్ చదివించాలి అనుకోవడమే మొదట మనము తీసుకున్న మంచి నిర్ణయము. అందులో ఏ బ్రాంచ్ తీసుకున్న, సరియైన కార్యాచరణ వేసుకుని దానిని అమలు పరుస్తూ నాలుగు సంవత్సరాలు చదువు పైన ద్రుష్టి పెట్టి, చదువుతో పాటుగా సాంస్కృతిక, సామజిక మరియు సాంకేతికపరమైన  కార్యక్రమాలలో చురుకుగా పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒక మంచి కాలేజీ లో సీట్ రాగానే తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరినట్లు కాదు. నిశితముగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చూస్తూ వారు సరియైన దిశలో వెళ్లేలా మార్గదర్శనం చేయవల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.  నాలుగు సంవత్సరా