Skip to main content

గురువు

ఆన్ లైన్ తరగతుల పుణ్యమా అని....ఇప్పుడు *గురువుల విలువ* తెలిసచ్చిన కరోనా సందర్బమిది...ఎంతైనా గురువు లేని విద్య గుడ్డి విద్యేనని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్న వేళ...........
ఏముంది పంతుళ్ళు...ఏదో వస్తరు....పోతరు....నాలుగు మాటలు తోచింది చెప్తరు...లేకుంటే సెలవులు....ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.........కానీ దానికి భిన్నం..మా వృత్తి.మేం తరాల తయారుదారులం.
ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4,5 గంటలు భరించలేని తల్లిదండ్రులు పిల్లల బళ్లకు పంపితే(వెల్లగొడితే).....
ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లల చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ,మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా,వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను,డాక్టర్లను,యాక్టర్లను,ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను, టీచర్లను,నాయకులను,అధికారులను ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా తరాలు *తరాలు* తయారుచేసే నిత్య విద్యార్థులం మేము.
మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.
చెమటను సాక్ష్యం గా చూపడానికి...
మా పనులు బురదలోనో,ఖార్ఖానా లో చేసేవి కావు.బట్టలకంటిన మురికిని చూపడానికి....
మా పనులు మూసలు కావు,మోసాలూ కావు.
ఏ రోజుకారోజు కొత్తే..
పిల్లాడు పిల్లాడికి కొత్తే..
ఏ రోజుకారోజు సమస్యలూ కొత్తే..
మా వనరులు పిల్లలు మాత్రమే..
మా పని చదువొక్కటే కాదు,జీవితాలు తీర్చిదిద్దుడు కూడా...
ఏ రోజుకు ఆ రోజో,నెలకో,ఏడాదికో ఫలితాన్ని చూపే కూలీలమో ,రైతులమో, అధికారులమో కాదు సుమా!?
*తరాన్ని* తయారు చేస్తూపోతాం..ఆ యజ్ఞం లో సమిదలవుతం..
ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులం..
మా చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి తయారైన అదే మాకు లక్షలు,కోట్లు..
పుణ్యానికి చేస్తారా అని అంటారా?
మీ ఇంట్లో ఉన్న మీ స్వంత ఇద్దరు పిల్లలనే బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి...పెంచండి..విద్య నేర్పండి..బుద్ధులు నేర్పండి...విలువలు నేర్పండి...గొప్ప మేధావిని చేయండి...గొప్ప అధికారిని కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తినో, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువునో,సన్యాసినో చేయండి..
అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు...అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు...అప్పుడే శారీరకంగా, మానసికంగా,సామాజికంగా, ఆర్థికంగా, ఆథ్యాత్మికంగా, ఉద్వేగాల,భావాల పరంగా,అన్ని విధాలా శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది..
ఎందుకండి కూర్చున్న కొమ్మను నరుకుతరు?!
అనంత సాగరమైన విద్యను,విజ్ఞానాన్ని మధించి
అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి,అర్థాంతరంగా తనువు చాలిస్తూ,పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులం..
మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు..
కించపరచకండి..
మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు..
తూలనాడకండి..
మాతోనో, మా సంతకంతోనో పని ఉంటే కదా! అంటారా?
అయితే సమాజంలో మిగిలేది మేధావులో,విలువలున్న మంచి మనుషులో కాదు..
మానవత్వం లేని మృగాలో, విలువల్లేని రోబోలో తయారవుతాయి...ఒకవేళ మీలా ఆలోచించి పంతుళ్ళు కూడా పక్క దోవ పట్టితే...
మాకు విలువివ్వండి...
విలువులన్న మనుషులను తయారుచేసే పనిలో తోడు రండి..
విలువులు తప్పిన ఒకరిద్దరు పంతుళ్ళను ఓ కంట కనిపెట్టండి..వారిని మందలించండి...
విద్య బళ్లోనే, అదీ గురువు సమక్షంలోనే దొరుకుంతుందని గుర్తుంచుకోండి...
గురువు అంటె, స్కూల్ నిర్వాకుడో, హాస్టల్ నిర్వాహకుడు.... కాదు సుమా నిక్కర్చిగా పాఠము చెప్పె మార్గదర్శి మాత్రమే...
ఇది చదివే మీ వెనుక, రాసిన నా వెనుక వెన్నెముకలా నిలిచిన ఎందరో గురువులను గుర్తు చేసుకుంటూ, వారికి ఈ నాలుగక్షరాలు అంకితమిస్తూ.....
Proud to be a Teacher



Comments

  1. అందుకే అంటారు... గురు బ్రహ్మః గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అనుచిత వ్యాఖ్యలు తగవు!

  అనుచిత వ్యాఖ్యలు తగవు! ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా  అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది.  సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..! బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక...

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు. ...

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు      ...