Skip to main content

ఆలోచించండి ఓ అమ్మ, నాన్న

 ఆలోచించండి ఓ అమ్మ, నాన్న

తల్లిదండ్రులు అలోచించి సరియైన నిర్ణయము తీసుకోవలసిన సమయము ఇది. ఎంసెట్ పరీక్ష పూర్తి అయి ఫలితాలు కూడా వచ్చిన సందర్భంలో ప్రతి తల్లి తండ్రి సరియైన దిశలో అలోచించి తమ పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఒక నిర్ణయము తీసుకోవాల్సిన సమయము ఇది.

ఇంజనీరింగ్ విషయము లో చాల మంది తల్లిదండ్రులు అయోమయం లో కొట్టుమిట్టాడుతున్న సమయము ఇది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీ ఎంచుకోవాలి అనే అయోమయ పరిస్థితుల్లో అటు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉన్నారు.

ఇంజనీరింగ్ చదివించాలి అనుకోవడమే మొదట మనము తీసుకున్న మంచి నిర్ణయము. అందులో ఏ బ్రాంచ్ తీసుకున్న, సరియైన కార్యాచరణ వేసుకుని దానిని అమలు పరుస్తూ నాలుగు సంవత్సరాలు చదువు పైన ద్రుష్టి పెట్టి, చదువుతో పాటుగా సాంస్కృతిక, సామజిక మరియు సాంకేతికపరమైన  కార్యక్రమాలలో చురుకుగా పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒక మంచి కాలేజీ లో సీట్ రాగానే తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరినట్లు కాదు. నిశితముగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చూస్తూ వారు సరియైన దిశలో వెళ్లేలా మార్గదర్శనం చేయవల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. 

నాలుగు సంవత్సరాల సమయములో మావాడు ఎలా చదువుతున్నాడు, పరీక్షలు ఎలా రాస్తున్నాడు, వివిధ కార్యక్రమాలలో ఎలా పాల్గొంటున్నాడు, వాడు చేస్తున్న స్నేహము ఎలా ఉంటుంది అని గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉన్నది.

ఇక ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానము చాలా బాధను కలిగిస్తున్నది. పలనా కోర్సు చేస్తేనే ఇంజనీరింగ్, పలనా కాలేజీ లో చదివితేనే ఇంజనీరింగ్ చదివినట్లు అనే మానసిక స్థితికి వచ్చేసారు. పిల్లాడిని చేర్చే కాలేజీ గురించి ఆలోచించడము లో తప్పులేదు కానీ ఈ కోర్సు చేస్తేనే ఇంజనీరింగ్ చదివినట్లు అని అనుకుంటున్న విధానము సరియైనది కాదు.

ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులు అందరూ ఓకే కోర్సులో చేరితే మున్ముందు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ పిల్లలను ఆధారము చేసుకున్న ఈ సమాజము, దేశము పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఒకసారి ఆలోచించాలి.

పిల్లవాడు ఏ కోర్సు తీసుకున్నప్పటికీ అందులో అతని ప్రతిభాపాటవాల మీద అతని భవిష్యత్తు ఉంటుంది, కానీ అతను తీసుకున్న కోర్సు అతని భవిష్యత్తును నిర్ణయించదు. అతను తీసుకున్న కోర్సులో తరగతి గదిలో అతను అందరికన్నా భిన్నముగా ఎలా ఆలోచిస్తున్నాడు, కొత్త కొత్త విషయాలపైన అతను జ్ఞానము ఎలా సంపాదిస్తున్నాడు అనేదాని మీద పిల్లాడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ కోర్సు చేసిన ఒకే రకమైన విలువ ఉంటుంది అని గుర్తించి పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తారు అని ఆశిస్తున్నాను.


తరిగొప్పుల రాజారామన్న

అసిస్టెంట్ ప్రొఫెసర్ 



  

Comments

Post a Comment

Popular posts from this blog

జలియన్ వాలాబాగ్ ఉదంతం (13/04/1919) జరిగి నేటికి 103 యేండ్లు.

పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయి ప్రభుత్వమే వేలాది అమాయక జనాన్ని పిట్టల్లా కాల్చి చంపిన కనీవినీ ఎరుగని కిరాతకం, కరకు ఆంక్షల ఇనుప తెరలు దాటి బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది. గజగజ వొణుకుతూ వెనక్కి వచ్చిన బండ్ల వారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు దారుణ దుర్వార్త ఆ రాత్రే తెలిసిపోయింది. ఘోరాతిఘోరాన్ని విన్న వారికి ఆ రాత్రి కునుకు లేదు. వారి గుండెలను పిండిన వేదనకు అంతులేదు.  అది...... 13 ఏప్రిల్ 1919, వైశాఖి పర్వదినం. పంజాబీలకు అతి ముఖ్యమైన పంటల పండుగ. దీపావళి, హోళీల్లాగే వైశాఖినీ హిందు, సిక్కు తేడా లేకుండా, కులభేదం పాటించకుండా అందరూ కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఆ ఏడూ ఎక్కడెక్కడి పల్లెల వారు బండ్లు కట్టుకుని అమృతసర్ చేరారు. కొత్త బట్టలు బొమ్మలు కొనిపెడుతూ, స్వర్ణ దేవాలయం దర్శించి, ఊరి బయట పెద్ద మేళాలో ఆటపాటల్లో పాల్గొంటూ జనం దిలాసాగా ఉన్నారు.  ఇది ప్రతి ఏడూ మామూలే. కానీ ఈసారి ఏదో చెప్పరాని వెలితి. ఊరివాళ్ల మొగాల్లో ఆందోళన. వాతావరణంలో ఉద్రిక్తత.  నాటికి నాలుగు రోజుల ముందు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనను పురికొల్పిన సేఫుద...

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు. ...

అనుచిత వ్యాఖ్యలు తగవు!

  అనుచిత వ్యాఖ్యలు తగవు! ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా  అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది.  సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..! బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక...