Skip to main content

గమ్యము - మార్గము - పయణం

 ఓ విద్యార్థి!

ఏది నీ గమ్యము, ఎటువైపు నీ పయనం. గమ్యము (లక్ష్యము) లేని పయనం లో ఆయాస పడుతూ ఎక్కడి వరకు, ఎంత వరకు. గమ్యము (లక్ష్యము) గుర్తెరిగి, కర్తవ్యము బోధపడి ఆ దిశగా వడివడి అడుగులు వేయగా, కాలము చాలా చిన్నది, విలువైనది చేజారిన తిరిగి రాదు. ఇక నైనా మేలుకో, గమ్యము (లక్ష్యము) ఎన్నుకొని గమ్య మార్గము నిర్ణయించుకుని ఆ దిశగా పయణము కొనసాగించు. విజయము సర్వదా సర్వత్రా నీదే. 

Comments

Post a Comment

Popular posts from this blog

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు                                          పెట్టి మైలబుచ్చి                 =      మాపు ను పోగొట్టి మంచి మడుపు జేయు  =     చక్కగా మడత పెడతాడు.

ఆలోచించండి ఓ అమ్మ, నాన్న

 ఆలోచించండి ఓ అమ్మ, నాన్న తల్లిదండ్రులు అలోచించి సరియైన నిర్ణయము తీసుకోవలసిన సమయము ఇది. ఎంసెట్ పరీక్ష పూర్తి అయి ఫలితాలు కూడా వచ్చిన సందర్భంలో ప్రతి తల్లి తండ్రి సరియైన దిశలో అలోచించి తమ పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఒక నిర్ణయము తీసుకోవాల్సిన సమయము ఇది. ఇంజనీరింగ్ విషయము లో చాల మంది తల్లిదండ్రులు అయోమయం లో కొట్టుమిట్టాడుతున్న సమయము ఇది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీ ఎంచుకోవాలి అనే అయోమయ పరిస్థితుల్లో అటు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉన్నారు. ఇంజనీరింగ్ చదివించాలి అనుకోవడమే మొదట మనము తీసుకున్న మంచి నిర్ణయము. అందులో ఏ బ్రాంచ్ తీసుకున్న, సరియైన కార్యాచరణ వేసుకుని దానిని అమలు పరుస్తూ నాలుగు సంవత్సరాలు చదువు పైన ద్రుష్టి పెట్టి, చదువుతో పాటుగా సాంస్కృతిక, సామజిక మరియు సాంకేతికపరమైన  కార్యక్రమాలలో చురుకుగా పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒక మంచి కాలేజీ లో సీట్ రాగానే తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరినట్లు కాదు. నిశితముగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయో చూస్తూ వారు సరియైన దిశలో వెళ్లేలా మార్గదర్శనం చేయవల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.  నాలుగు సంవత్సరా