బంగారు బాట (వోటర్లకు దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనం) గెలుస్తానని గాలి వ్యాపింపజేసినవాడి వెంటబడి పోవద్దు. ఎవరు గెలవాలని నీవు ఎంచుకొన్నావో, అతనికి అన్ని విధాలా సహాయమందించి, అతడు గెలిచేలా చూడు. అప్పుడు అది నీ గెలుపు అవుతుంది. గెలుస్తున్నాడని గాలి వ్యాపింపజేసిన వాని వెనుక మందలో గొఱ్ఱెలా నడిచినట్లయితే, ఆ క్షణాన్నే నీవు ఓడిపోయావు, వోట్ల లెక్కింపు అనంతర ఫలితంతో సంబంధం లేదు. సిద్ధాంత నిబద్ధత, కార్యప్రణాళిక లేని పార్టీ లు చాలా చేటు తెస్తాయి. అటువంటి పార్టీలు నిలబెట్టిన మంచి వ్యక్తులు ఎన్నికైనా, వారు చేయగలిగింది తక్కువ. కాబట్టి వోటు వేసే ముందు ఇది నిర్ధారించుకో: నీవు ఒక వ్యక్తికి వోటు వేయటం లేదు. ఒక పార్టీకి వేస్తున్నావు. పార్టీకి వేయటమంటే, అందమైన గుర్తునుచూసి వోటు వేయటం కాదు, ఒక స్పష్టతగల్గిన సిద్ధాంతానికి, నిర్దిష్టమైన కార్య ప్రణాళికకూ వోటువేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ పైసలకు కక్కుర్తిపడి నీవోటును వృధా చేసుకోవటం లేదని నిర్ధారించుకో!
సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో. వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు. చాకివాడు = వస్త్రాన్ని చీకాకు పడజేసి = బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు పెట్టి మైలబుచ్చి = మాపు ను పోగొట్టి మంచి మడుపు జేయు = చక్కగా మడత పెడతాడు.